పోషణ్ పక్వాడ్ పై అవగాహణ కార్యక్రమం

– అన్నప్రాసన,అక్షరాభ్యాసం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
పోషణ పక్వాడ్ లో బాగంగా నియోజక వర్గం కేంద్రం అయిన  అశ్వారావుపేట లోని బి ఎస్ ఆర్ నగర్,వికలాంగుల కాలనీల లోని అంగన్వాడి కేంద్రాలలో పోషకాహార లోపం తో కలిగే అనర్ధాలు,పోషక విలువలు వున్న ఆహరం ప్రాధాన్యత పై తల్లులకు అవగాహన కల్పించారు. ఇక్కడ ఉన్న  ప్రీ స్కూలు పిల్లలు (3 – 6)కు  15 కుర్చీలను పూర్వ వార్డు సభ్యులు  జినుగు రవీంద్ర వితరణ గా అందజేసారు. ముగ్గురు పిల్లలకు అన్నప్రాసన, 8 మంది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ  రోజా రాణి,సూపర్ వైజర్ విజయలక్ష్మి,అంగన్వాడి టీచర్ వాణి,విజయ,ఉష,ఇందు. రాధ,నాగమణి పాల్గొన్నారు.