
మండలంలో ఈనెల 28వ తేదీ నుండి నుండి వచ్చే నెల ఆరు వరకు అభయ హస్తం గ్యారెంటీల అమలులో భాగంగా గ్రామాల్లో నిర్వహించే ప్రజా పాలన గ్రామ సభలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అధికారులు ఆయా గ్రామాల అధికారులు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. గురువారం నుండి ఆయా గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అభయ హస్తం ఆరు గ్యారెంటీ లకు లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరణపై మండల స్థాయి అధికారులు వివరించారు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే ప్రజలకు సౌకర్యాలు, అభయ హస్తం ఆరు గారెంటీ పథకాల గురించి ప్రజలకు తెలిసేందుకు ప్రచారం, తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షురాలు లోలపు గౌతమి, మండల ప్రత్యేక అధికారి యోహన్, ఎంపీడీవో సంతోష్ రెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, డిప్యూటీ తహసిల్దార్ భాస్కర్, ఎస్ఐ రాజశేఖర్, మండల పరిషత్ కార్యాలయ సూపరిండెంట్ మైలారం గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.