సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం

నవతెలంగాణ -ఆర్మూర్  
పట్టణంలోని సివిఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థి విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థి దశ నుంచి ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని న్యాయవాది గటడి ఆనంద్ తెలిపారు ..గ్రామస్థాయి నుంచి మొదలుకొని పార్లమెంట్ వరకు తమకు కావాల్సిన సమాచారం ఈ చట్టం ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు జీవించే హక్కు భంగం కలిగించే సందర్భంలో 48 గంటల్లో సమాచారం ఇవ్వాలని తెలిపారు గ్రామస్థాయి సంవత్సరం కావాలంటే ఎలాంటి రుసుము కట్టనవసరం లేదు  మండల స్థాయికి 5 రూపాయలు జిల్లా స్థాయికి 10 రూపాయలు , అలాగే దరఖాస్దారునికి తప్పుడు సమాచారం ఇచ్చిన అసంపూర్తి సమాచారం ఇచ్చిన వారికి రోజుకు 250 నుంచి 25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది అలాగే సెక్షన్ 2J(1) ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 1గంటసేపు ఉచితంగా రికార్డులు తనిఖీలు చేసే అధికారం ఈ చట్టం కల్పించింది అలాగే ఈ చట్టం ద్వారా సాధించిన విజయాలు, ఏలా దరఖాస్తు చేసుకోవాలో వివరంగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జాకీర్, లెక్చరర్లు మల్లికార్జున్ ,దిలీప్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.