– జూలై మూడు వరకు అవగాహన కార్యక్రమాలు
– గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ ప్రియాంక
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ప్రపంచ సికిల్ సెల్ డే ను పురస్కరించుకొని బుధవారం సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సికిల్ సెల్ అనేమియా వ్యాధిని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరోగ్య విభాగం జాతీయ సికిల్ సెల్ అనిమీయా ఎలిమిషన్ మిషన్ ను ప్రారంభించింది. ఈ మిషన్ ద్వారా 2047 వరకు సికిల్ సెల్ అనీమియా వ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంట్లో భాగంగానే నేడు ప్రపంచ సికిల్ సెల్ రోజును పురస్కరించుకొని నల్గొండ జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా శిశు సంక్షేమ శాఖ ల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.సికిల్ సెల్ అనిమియా వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ ప్రియాంక తెలిపారు.ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దీనిపై అవగాహన కోసం బుధవారం నుండి జూలై 3 వరకు అవగాహన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ వ్యాధి ఎలా సోకుతుంది, వ్యాధి లక్షణాలు, సికిల్ సెల్ వ్యాధి అనేది ఒక జన్యు కారక వ్యాధి దీని వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేసే జన్యువులు లోప భూయిష్టంగా ఉంటాయని, సాధారణ రక్త కణాల కంటే సికిల్ కణాలు మందంగా ఉంటాయని, తద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు రక్త సరఫరాను సక్రమంగా జరగనివ్వక పోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని, ఈ వ్యాధిని ఎలా నివారించాలనే విషయాలపైముక్యంగా పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా సికిల్ సెల్ అనిమీయా అనేది గిరిజనుల్లో ఎక్కువగా ఉందని, ఈ వ్యాధి విస్తరించకుండా నిర్మూలించాలనే ఉద్దేశంతో 1 జులై 2023 లో జాతీయ సికిల్ సెల్ అనీమియా ఎలివేషన్ మిషన్ ను ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారని, గిరిజనలకు ఈ వ్యాధి పై అవగాహన కల్పించాలని అధికారుకు సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ అనీమియా (రక్తహీనత) అనేది వివిధ రూపాల్లో ఉంటుందని ఐరన్ లోపం వల్ల వచ్చే అనీమియా, బి- 12 లోపం వల్ల వచ్చే అనీమియా, ఏ ప్లాస్టిక్ అనీమియా, తల సేమియా గా ఉంటుందని, కానీ సికిల్ సెల్ అనీమియా అనేది సైలెంట్ కిల్లర్ గా ఉంటుందని దీనిని గుర్తించి చికిత్స తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ ఆర్ సి ఓ సుధాకర్, ఐసిడిఎస్ పీడీ సక్కుబాయి, గిరిజన సంక్షేమ శాఖ ఏవో జాఫర్,ఏఎన్ఎం లు, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.