ఫైనాన్షియల్ లిటరసీ వీక్ 2024 పై అవగాహన ర్యాలీ

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
ఫైనాన్షియల్ లిటరసీ వీక్ 2024 లో భాగంగా ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం లీడ్ బ్యాంక్ మంగళవారం నాడు ఉదయం 7:00 గంటలకు బ్యాంకర్లతో 2 కె వాకథాన్ నిర్వహించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వాకథాన్ భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఎంపీడీవో  కార్యాలయం వరకు ప్రారంభమై తిరిగి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ముగిసింది.  ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 1వ  తేదీ వరకు ఆర్థిక అక్షరాస్యత వారాన్ని ఆర్బిఐ మేకు ఏ రైట్ స్టార్ట్, బీకామ్ ఫైనాన్షియలి  స్మార్ట్ అనే నినాదంతో  నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎల్డిఎం  శ్రీరామకృష్ణ, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.