సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ..

నవతెలంగాణ – రెంజల్ 

జూలై నెల డెంగ్యూ నెలగా పరిగణించబడుతుందని, ఈ నెలలో పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డివిజనల్ సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ నెలలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఇంటి ముందర గుంటలు లేకుండా చూసుకోవాలని, మీరు నిల్వ ఉన్నట్లయితే వాటిలో దోమలు చేరి ప్రజలు దోమకాటు గొర్రె అవకాశం ఉందన్నారు. కొబ్బరి చిప్పలు, పాత టైర్లలో నీరు నిల్వ ఉన్నట్లయితే దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దోమ కాటు వల్ల పైలేరియా, మలేరియా, డెంగ్యూ, చికెన్ గూనియా లాంటి వ్యాధులు ప్రభలే అవకాశ ఉందని ఆయన తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిన్న సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఫ్రైడే డ్రై డేగ పరిగణించబడినందున, వర్షాకాలంలో వారంకు ఒకసారి తమ తోటిలను శుభ్రం చేసుకోవాలని వారు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు  ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి శ్రావణ్ కుమార్, పీహెచ్ న్ రాణి, సూపర్వైజర్ మాలంబి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.