త్రిబుల్ ఆర్ పై అవగాహన ర్యాలీ..

నవతెలంగాణ – ఎల్లారెడ్డి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సుపరిపాలన లో భాగంగా శనివారం ఎల్లారెడ్డి మున్సిపల్ సిబ్బంది త్రిబుల్ ఆర్ పై మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో వాహనాలతో అవగహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వాహనాలను సిబ్బంది పూలతో సుందరంగా అలంకరించి, మున్సిపల్ కార్యాలయం నుంచి మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ మేనేజర్ , మున్సిపల్ మెప్మా ఆర్పిలు, పారిశుద్ధ్య సిబ్బంది ర్యాలీగా వాహనాలతో ర్యాలీ గా బస్టాండ్ వరకు వెళ్లారు. ప్రజలకు పారిశుద్ధ్యం పట్ల అవగాహన కల్పించారు, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేయవద్దని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం రోగాలను తరుముదాం అంటూ నినాదాలు ర్యాలీ నిర్వహించారు. తిరిగి మున్సిపల్ కార్యాలయానికి చేకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జీవన్, మేనేజర్ వాసంతి, మెప్మా ఆర్పిలు సోనీ, అమృత, రేఖ, హసీనా, సవిత, కిరణ్, మున్సిబల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.