నిజామాబాద్ డివిజన్ పోలీసు అధికారులకు అవగాహన సదస్సు

నవతెలంగాణ –  కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జి. వైజయంతి  ఉమ్మడి జిల్లా (నిజామాబాద్, కామారెడ్డి జిల్లా) డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి. లక్ష్మినర్సయ్య ల ఆదేశానుసారం నిజామాబాద్ డివిజన్ పోలీసు అధికారులకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ భూసారపు రాజేష్ గౌడ్ మహమ్మద్ రహిమొద్దీన్ శిక్షణ తరగతులు నిర్వహించి, పౌరహక్కుల రక్షణ చట్టం 1954 గురించి ప్రథమ సమాచార సేకరణ నుండి కోర్టులో చార్జీషీట్ వేసే వరకు జరుగుతున్న లోపాల గురించి వివరంగా తెలిపిన కేసులో నేరస్థులకు శిక్ష పడేటట్టు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ సమావేశంలో డిస్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్  లక్ష్మి నరస్రయ్య, ఎసిపి కిరణ్ కుమార్  ప్రాసిక్యూటర్ బంటు వసంత్, డివిజన్ సి.ఐ లు, యస్.ఐ లు, ఎక్సైజ్ ఆఫీసర్లు, లైసెనింగ్ ఆఫీసర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు పాల్గొన్నారు.