నవతెలంగాణ – ఆర్మూర్
రోటరీ క్లబ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిని విద్యార్థులకు రోడ్డు భద్రత మాసోత్సవాలులో భాగంగా బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. అధ్యక్షులు రజనీష్ కిరాడ్ మాట్లాడుతూ పోలీసులు కనిపించినప్పుడే మనకు హెల్మెట్ ధరించాలని, సీటు బెల్టు పెట్టుకోవాలని గుర్తొస్తుంది అలా కాకుండా మనము ట్రాఫిక్ నియమాలను అలవాటు చేసుకుని ఎల్లప్పుడూ దాని పాటించి మన ప్రాణాలను మనం రక్షించుకోవాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, ట్రాఫిక్ చట్టాలు, నియమాలను పాటించకుంటే జరిగే అనర్థాల గురించి ఒక గంట సేపు అవగాహన కల్పించి అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశారు. తర్వాత డాక్టర్ ప్రకాష్ ఆర్థోపెడిక్ సర్జన్ గారు సంఘటన స్థలంలో యాక్సిడెంట్ తర్వాత మొదటి గంట సేపు లో వెంటనే క్షతగాత్రులను ఎలా రక్షించాలి ఏమేమి చేయాలి క్లుప్తంగా వివరించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సోషల్ మీడియాను అతిగా వాడి మోసపోవద్దు ఎవరికి నమ్మవద్దని సూచించారు. ఇ కార్యక్రమంలో క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ కరస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్ ,ప్రిన్సిపాల్ పాండేజీ, ట్రాఫిక్ & రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ కే విద్యాసాగర్ ,ఎన్ హెచ్ 44 ఇండిపెండెంట్ ఇంజనీర్ టి. రామారావు , డిచ్పల్లి టోల్ పే ప్రాజెక్ట్ మేనేజర్ అనిల్ కుమార్ సూచనలు సలహాలు చేశారు. ఇట్టి కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి రాస ఆనంద్ ఖాన్దేష్ సత్యం, కాలేజీ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.