బేటి బచావో బేటి పడావో పై అవగాహన సదస్సు…

Awareness conference on Beti Bachao Beti Padao...నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్..
నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం రోజు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  కామారెడ్డి జిల్లా మహిళా సాధికారిక కేంద్రం బేటీ  బచావో బేటి పడావో కార్యక్రమం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  (PC&PNDT Act)  గర్భ లింగ నిర్ధారణ నిషేధ చట్టం, లింగ సమానత్వం,  బాల్యవివాహాల, ఫోక్సొ గురించి, మహిళల చట్టాలపై , మిషన్ శక్తి మరియు బిబిపి స్కీమ్స్, సుకన్య సమృద్ధి యోజన ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమ యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, మహిళలకు పురుషులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో సఖి సిబ్బంది సిఐ  పాల్గొని గృహహింస చట్టం, సఖి సర్వీసెస్ గురించి వివరించడం జరిగింది  హెల్ప్ లైన్ నెంబర్ 100, 1930,1098,14567 ల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సృజన్ కుమార్,  సూపర్వైజర్స్, ఏ ఎన్ ఎం, మెయిల్ స్టాప్ ఆశ వర్కర్స్ డ్రగ్ ఎడ్యుకేటర్, మరియు గర్భిణీలు జనరల్ మహిళలు పురుషులు పాల్గొనడం జరిగింది.