విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన సదస్సు..

Awareness conference on child marriage for students.నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండలంలోని హన్మాజిపేట్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో జెడ్ పి హెచ్ ఎస్ పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు బుధవారం డాక్టర్ దివ్యశ్రీ ఆధ్వర్యంలో బాల్యవివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దివ్యశ్రీ మాట్లాడుతూ బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బాల్యవివాహాలు అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని విద్యార్థులకు తెలియజేశారు. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. బాల్యవివాహాలు నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇంకా అక్కడక్కడ బాల్యవివాహాలు జరగడం చాలా శోచనీయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 18 సంవత్సరాల లోపు బాలికకు, 21 సంవత్సరాల లోపు అబ్బాయిలకి వివాహం చేస్తే పెళ్లి కుమారునికి వారి తల్లిదండ్రులకు పెళ్లిలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మైనర్ బాలికను వివాహం చేసుకొని తనతో సంసారం చేసిన భర్తకు ఫోక్సో చట్టం కింద పది సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుందని విద్యార్థులకు తెలియజేశారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు ఎవరి దృష్టికి వచ్చిన హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా వెంటనే ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. బాల్య వివాహం నేరం.. చట్టం ప్రకారం శిక్ష అర్వులు, బాల్యవివాహాలు చేసిన చేసుకున్న ప్రోత్సహించిన రెండేళ్లు జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా అనే నినాదంతో తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. బాల్యవివాహాలు చట్ట విరుద్ధమని అన్నారు.ఈకార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు గంగమరాజు, ఎం ఎల్ హెచ్ పి సుజాత, ఎన్ సి డి స్టాఫ్ నర్స్ గాయత్రి, ఏఎన్ఎంలు , ఆశా కార్యకర్తలు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.