9న విదేశాల్లో ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు

నవతెలంగాణ – సిద్దిపేట : తెలంగాణా నుండి అర్హత కలిగిన, నైపుణ్యం కలిగిన , సెమీస్కిల్డ్ కార్మికులకు విదేశీ ప్లేస్‌మెంట్‌ను సులభతరం చేయడానికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్), (తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక, ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖ క్రింద ఒక రిజిస్టర్డ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ) ఈ నెల 9న ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి పక్కన ఉన్న ఐటీ టవర్స్ లో అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు టామ్‌కామ్ హెచ్ ఆర్ మేనేజర్ శ్రావణి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ గల్ఫ్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగేరి, జపాన్, పోలాండ్, రొమేనియా, యు కే వంటి వివిధ దేశాలలో ప్రభుత్వ, ప్రైవేట్ నమోదిత ఏజెన్సీలతో తమ సంస్థ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుందని తెలిపారు. సురక్షితమైన, చట్టబద్ధమైన వలస మార్గాల ద్వారా సులభతరం చేయడంలో నిరుద్యోగులకు తమ సంస్థ సహాయం చేస్తుందన్నారు. ఓవర్సీస్ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు , ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులను అప్‌డేట్ చేసిన రెజ్యూమ్ మరియు సంబంధిత డాక్యుమెంట్‌లతో డ్రైవ్‌కు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 8247838789 / 7893566493 / 9849639539 ని సంప్రదించాలని సూచించారు.