తపాల శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ స్కీములపై  అవగాహన సదస్సు

నవతెలంగాణ – బాల్కొండ 
మండల పరిధిలోని చిట్టాపూర్  గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామస్తులందరితో తపాలా శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ స్కీములపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అఫ్ పోస్టాఫీసెస్ ఆర్మూర్ డివిజన్ ఏఎస్పీ శ్రావణ్ మాట్లాడుతూ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో మీ కుటుంబంలో ప్రతీ ఒక్కరికి ఉపయోగపడే పోస్టల్ స్కీములు ఉంటాయని 500/- లతో ఎస్బి ఎకౌంటు ఓపెన్ చేయవచ్చని, అలాగే ఆర్డీలు నెలనెలా కట్టవచ్చని,సుకన్యా సమృద్ధి యోజన 10 సంవత్సరాల లోపలి ఆడ పిల్లలకు నెల నెలా  డిపాజిట్ చేస్తే వారు పెళ్లీడుకు వచ్చేసరికి డబ్బులు ఉపయోగపడతాయని, బ్యాంకు మాదిరిగా డిపాజిట్ చేసే వారి కొరకు  కిషన్ వికాస పత్రము,ఇందిరా వికాస పత్రాలు  ఉంటాయని,అతి తక్కువ ధరలో యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీలు ఖాతాలు ఓపెన్ చేసుకోవచ్చని, బ్యాంకు మాదిరిగా గ్రామంలో మీ ఇంటి దగ్గర నుండి లావాదేవీలు జరుపుకోవచ్చు అన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులకు పోస్టల్ స్కీమ్ లపై అవగాహన కలిగించడానికి పాఠశాల  ప్రధానోపాధ్యాయులు సుదర్శన శర్మ, గ్రామ సెక్రెటరీ సాయి కృష్ణ,బీపీఎంలు ఉపన్యాసించారు.ఈ కార్యక్రమంలో మెయిల్ వోవరీస్  దశరథ్,ఆర్మూర్ డివిజన్ పోస్టల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, సమన్వయకర్తగా జింధం నరహరి వ్యవహరించారు.స్థానిక గ్రామ బీపీఎం గంగాధర్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల బీపీఎంలు, ఫతేపూర్,సుర్బిర్యాల్, కోమన్ పల్లి, జలాల్ పూర్,బోదేపల్లి వన్నెల్(బి), బాల్కొండ డిడిఏ మహిళా సంఘాల నాయకులు,మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.