బాల్య వివాహ నిరోధక చట్టం-2006లపై అవగాహన సదస్సు

– బాలలపై లైంగిక నేరాల రక్షణ చట్టం-2012,  బాల్య వివాహ నిరోధక చట్టం-2006 ల పై అవగాహన సదస్సు
– జిల్లా బాలల పరిరక్షణ విభాగం
నవతెలంగాణ- తాడ్వాయి
బాలల బంగారు భవిష్యత్తుకై హక్కులపై అవగాహన బాలలపై లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం –  2012, మరియు బాల్య వివాహాల నిరోధక చట్టం – 2006 లపై గురువారం కాటాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో హెచ్ఎం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ములుగు జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాలలు విద్యార్థి దశలో మంచి అలవాట్లు, మంచి గుణాలు అలవర్చుకోవాలని, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, వాటిని సాధించాలని తెలిపారు. అదేవిధంగా ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని తెలిపారు. ఐసిపిఎస్ సోషల్ వర్కర్, జ్యోతి పాక్సో చట్టం- 2012, మరియు బాల్య వివాహాల నిరోధక చట్టం- 2006, ఈ చట్టాలపై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై లైంగిక వేధింపులు,  గుడ్ టచ్, బ్యాడ్ టచ్, గెలుపు  పొందడానికి వారిలో మంచి అలవాట్లు నేర్చుకునే పద్ధతుల గురించి వివరించారు. బాలలు విద్యార్థి దశలో మంచి అలవాట్లు, మంచి గుణాలు అలవర్చుకోవాలని, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, వాటిని సాధించాలని తెలిపారు. తమను తాము కాపాడుకొనేలా, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే చట్టపరమైన రక్షణ పొందేలా జిల్లాలోని బాలల బాలికలకు అవగాహన కల్పించారు.   ఈ కార్యక్రమంలో కాటాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల  ఉపాధ్యాయులు జాఫర్అలీ, శ్రీనివాస్, జీవన్ లాల్, జైపాల్, పద్మజ, సంధ్య రాణి, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గోన్నారు.