టీవీఎస్ బిఎస్ 6 వాహనాలపై అవగాహన సదస్సు..

Awareness seminar on TVS BS6 vehicles..నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పరమేశ్వరి టివి ఎస్ షో రూమ్ యజమానులు మోటురి మధు, మోటురి ప్రవీణ్  ఆధ్వర్యంలో టి వి ఎస్ కంపెనీ వారిచే నిర్వహించిన బి ఎస్ 6 వాహనాలపై శనివారం అవగాహన సదస్సు కు వేములవాడ పట్టణం, మండల గ్రామాల   ఉన్నటువంటి ప్రైవేట్ గ్యారేజ్, మెకానికులకు  అవగాహన సదస్సు నిర్వహించారు.  అనంతరం మోటూరి మధు మాట్లాడుతూ కంపెనీ వారిచే నిర్వహించబడుతున్న ఈ అవగాహన సదస్సు ను గ్యారేజి యజమానులు సద్వినియోగం చేసుకోవాలని మికైన, మాకైన కష్టమర్లె దేవుళ్ళు వాళ్ళకి టి వి ఎస్ వాహనాల ద్వారా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనేది కంపెనీ తాపత్రయం అని అన్నారు. కాబట్టి  ప్రైవేట్ గ్యారేజ్ ఓనర్స్, మెకానికులకు  సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కోరుట్ల బస్టాండ్ లో ఉన్నటువంటి పాత షో రూమ్ కంపెనీ తొలగించడం వల్లనే మాకు నూతన టీవీఎస్ పరమేశ్వరి అనే పేరుతో కంపెనీ వారు అనుమతులు లభించాయని తెలియజేశారు.  బి ఎస్ 6 వాహనాలపై ఎలాంటి సందేహాలు ఉన్న షో రూమ్ లో వివరాలు తెలుసుకోవచ్చు అని మెకానికులకు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ప్రైవేట్ గ్యారేజ్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు,  యజమానులు ప్రైవేట్ మెకానిక్ గ్యారేజ్ ఓనర్లు మోటూరి మదను శాలువాతో  సత్కరించి సన్మానించారు.  గ్యారేజ్, యజమానులకు, మెకానికులకు మాతృశ్రీ ఆసుపత్రి నిర్వాహకులు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి ఉచిత రక్త పరీక్ష, మధుమేహ పరీక్ష లు నిర్వహించారు. ఉచిత హెల్త్ క్యాంప్ కార్యక్రమానికి సహకరించిన ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ చికోటి సంతోష్ కి మోటురి మధు ధన్యవాదాలు తెలిపి సన్మానించారు.  షో రూమ్ నిర్వాహకులు మధు, ప్రవీణ్ పిలవగానే వచ్చినటువంటి ప్రైవేట్ గ్యారేజ్ యజమానులకు వారు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెకానికులు, గ్యారేజ్ యజమానులతో పాటు షో రూమ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.