నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జిల్లా మహిళా సాధికారక కేంద్రం బేటి బచావో బేటి పడావో పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మిషన్ కోఆర్డినేటర్ శిరీష సతీష్ రెడ్డి మాట్లాడుతూ లింగ సమానత్వం, బాల్యవివాహాలు, ఫోక్సో చట్టం, మహిళల చట్టాలపై విద్యార్థులకు వివరించారు. మిషన్ శక్తి, బి బి పి స్కీమ్స్, సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, హెల్ప్ లైన్ నెంబర్లు 100, 1930, 1098, 14567 గురించి అవగాహన కల్పించారు. డ్రగ్స్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ సుమన్ మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వల్ల జరిగే అనర్థాలు, ప్రమాదాల గురించి వివరించారు. అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెండర్ స్పెషలిస్ట్ శారద, ఫైనాన్షియల్ లిట్రసి సౌందర్య, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.