తపాల శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు..

Awareness conference under the auspices of the postal department.నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని తపాలా కార్యాలయం వారి ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో సుస్మిత బెనర్జీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టాఫీసు నిజామాబాద్ సౌత్ సబ్ డివిజన్ తపాలా కార్యాలయం అందిస్తున్న వివిధ రకాల పథకలపై వివరించారు. ప్రధానంగా స్కీములు,సేవింగ్ ఖాతాలు, ఇన్సూరెన్స్ స్కీములు, జన సురక్ష స్కీం లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది తెలంగాణ వర్సిటీ సబ్ – పోస్ట్ మాస్టర్ పి. చరణ్,  బి.స్నేహిత్, ఎన్ సుశాంత్,మంతెన రవి, టీచింగ్,నాన్ టీచింగ్, ఔట్సోర్సింగ్  సిబ్బంది పాల్గొన్నారు.