రాజ్యాంగం, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి..

నవతెలంగాణ –  సూర్యాపేట కలెక్టరేట్
రాజ్యాంగం చట్టాలపై ప్రజలందరూ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేపీపీఎస్) రూపొందించిన 2024 నూతన సంవత్సర డైరీని శనివారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులకు రాజ్యాంగంలో పొందుపరచబడిన చట్టాలు, హక్కుల గురించి కేపీపిఎస్ రూపొందించిన డైరీలో ముద్రించి అందరికీ అందజేయడం అభినందనీయమన్నారు. రాజ్యాంగంలో కల్పించబడిన హక్కులు, చట్టాలపై ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమాజంలో వస్తున్న రుగ్మతలను సామాజిక చైతన్య స్ఫూర్తితో పారదోలాలని అన్నారు. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దున్న శ్యామ్, టీఎన్జీవోస్ నాయకులు నరహరి, పట్నం జిల్లా కన్వీనర్ జె.నరసింహారావు, జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి, కేపీపీఎస్ జిల్లా నాయకులు చినపంగి నరసయ్య, టేకుల సుధాకర్, పాల్వాయి కవిత తదితరులు పాల్గొన్నారు.