వరదల పట్ల అవగాహన పెంచుకోవాలి

Awareness should be raised about floods– ఏ కమలాకర్ ఎస్ ఐ పసర పోలీస్ స్టేషన్
నవతెలంగాణ – గోవిందరావుపేట
వరదల పట్ల సమీప గ్రామాల ప్రజలు అవగాహన పెంచుకోవాలని పసర పోలీస్ స్టేషన్ ఎస్.ఐ ఏ కమలాకర్ అన్నారు. సోమవారం మండలంలోని రాఘవపట్నం గ్రామంలో గ్రామ ప్రజలకు వరదలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.వర్షకాలం సంభవించు వరదలను దృష్టిలో ఉంచుకొని  జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గత అనుభవాల దృశ్య గ్రామం లో వరద తాకిడి పెరుగుతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో గ్రామస్తులకు సూచనలు చేయటం జరిగింది. ఏదైనా ప్రమాదం అనిపిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని, వరద ముంపు కు గురి కావటానికి అవకాశం ఉన్న ప్రాంతాల వారు వర్ష తీవ్రత బట్టి వరద తాకిడిని అంచనా వేస్తూ ముంపు ప్రాంతాన్ని కాలి చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ల వలిసి ఉంటుందన్నారు.