ఓటు హక్కు వినియోగంపై అవగాహన పెంచుకోవాలి

– లకావత్ సునీల్ నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్
నవతెలంగాణ-గోవిందరావుపేట : ప్రతి ఓటరు తన ఓటు హక్కు వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్ లాకావత్ సునీల్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లతో సునీల్ మాట్లాడుతూ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి సామాన్యుడి పదునైన ఆయుధం ఓటు హక్కు అని సరియైన అభ్యర్థిని ఎంచుకొని ఓటు వేయాలని సూచించారు. మంచి పరిపాలనకై ప్రజలకు న్యాయం జరిగే విధంగా
ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్లతో పాటు పలువురు ఓటర్లు పాల్గొన్నారు.