నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ నీటి వనరుల రిసోర్స్ మ్యాప్ ద్వారా గ్రామంలో ఉన్న బోర్లు, బావులు, కుంటలు, చెరువులను గుర్తించడం జరిగిందని రిలయన్స్ ఫౌండేషన్ ఇంజనీర్ సూర్య, ఆర్ ఎఫ్ భూపతి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో రైతులు మొక్కజొన్న, పత్తి, కూరగాయలు పంటలు ఎక్కువగా పండిస్తారని దీనికి అనుగుణంగా అవసరం ఉన్నచోట కుంటలు, చెక్ డ్యాములు, డ్రైనేజీ, కాలువ పూడిక నిర్మాణాల గురించి రైతులకు వివరించారు. అనంతరం పాడి పశువుల గురించి రిసోర్స్ పర్సన్ రాజేశ్వరి మాట్లాడుతూ పశువులలో నాణ్యమైన బ్రీడ్ సెలక్షన్, పశు పోషణలో మెలకువలు, పాల దిగుబడి పాలలో వెన్న శాతం పెంచుకునే మెలకువలు, మినరల్ మిక్సర్, పశువుల షెడ్ గురించి సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోతిరెడ్డి, పాలకేంద్రం అధ్యక్షులు రవీందర్ రెడ్డి, కార్యదర్శి రవి, విష్ణువర్ధన్ రెడ్డి, యాదిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాపురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.