నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం దుాపల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు సూపర్ బ్రెయిన్ యోగ శిక్షణ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇటీవల గుంజీల మాస్టర్ గా పేరొందిన అందే జీవన్ రావు పదవి విరమణ పొందిన తర్వాత మొదటిసారిగా ధూపల్లి పాఠశాలకు విచ్చేసిన సందర్భంగా యోగ శిక్షణ పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. వెంకటలక్ష్మి తెలిపా రు. సూపర్ బ్రెయిన్ యోగ శిక్షణ ద్వారా విద్యార్థులలో మెదడు చురుకుగా పనిచేస్తున్న జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సూపర్ బ్రెయిన్ యోగ ప్రతి రోజు విద్యార్థులతో యోగా నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్టియు మండల అధ్యక్షులు సోమలింగం గారు, ఉపాధ్యాయులు కృష్ణ, సాయన్న, రాజేశ్వర్, ప్రభాకర్, రాధా, తదితరులు పాల్గొన్నారు.