డ్వాక్రా గ్రూపు మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లింపులపై మహిళా సంఘాలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎం చిన్నయ్య, బ్యాంకు మేనేజర్ నాగనాథ్ ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కల్పించారు. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీ గారి లక్ష్మి అధ్యక్ష త నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో పలువురు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రుణాల చెల్లింపులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, నెలకు ఒఒకసారైనా ఐకెపి సిబ్బంది కానీ బ్యాంక్ అధికారులు కానీ ఆయా గ్రామాలలోకి వచ్చి పిల్లలకు అవగాహన కల్పించినట్లయితే రుణాలు సకాలంలో చెల్లించే అవకాశం ఉందని వారు అధికారులకు తెలియపరిచారు. నూతన బైలా ప్రకారం మహిళలు రుణాలను పొందిన వెంటనే క్రమం తప్పకుండా బ్యాంకులో రుణాలను చెల్లించాలని వారు సూచించారు. బుక్ కీపింగ్, ఇతర రిజిస్టర్ ను సక్రమంగా కొనసాగించేలా ఐకేపీ సిబ్బంది వారికి సహకరించాలని బ్యాంకు మేనేజర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు లక్ష్మీ గారి లక్ష్మి, కార్యదర్శి మాధవి, కోశాధికారి స్వరూప, సీసీలు భాస్కర్, కృష్ణ, రాజయ్య, శివకుమార్, శ్యామల, సునీత, కంప్యూటర్ ఆపరేటర్ తస్లీమా తదితరులు పాల్గొన్నారు.