నూతన చట్టాలపై సహా చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన

Awareness under Law Enforcement Committee including new lawsనవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని ఉప్పల్ వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన నూతన చట్టాలపై సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎం ఏ సలీం మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన నూతన చట్టాలైనా భారత న్యాయ సంహిత చట్టం, భారతీయ నాగరికత సురక్ష సంహిత చట్టం, భారతీయ సాక్ష్యము లా చట్టాలపై అవగాహన కల్పించారు. సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన కల్పిస్తూ, సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం అని అన్నారు. అవినీతి అక్రమాలను తేట తెల్లం చేయడానికి పని చేస్తుందని విద్యార్థులకు సూచించారు. చట్టాలను కుటుంబ సభ్యులతోపాటు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సహ చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా సంయుక్త కార్యదర్శి సంకి రతన్ కుమార్, జోనల్ అధ్యక్షులు సిర్నాపల్లి ప్రదీప్ కుమార్, న్యాయవాది శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.