జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆధ్వర్యంలో అవగాహన 

నవతెలంగాణ-తాడ్వాయి :
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని ఇంగ్లీష్ మీడియం బాలికల పాఠశాలలో శనివారం జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం(ఎన్ డి ఆర్ ఎఫ్) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వరదలు, భూకంపం, రోడ్డు ప్రమాదాలు, ఆకస్మిక గుండెపోటు తదితర ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు, వాలంటీర్లకు, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఎన్డిఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ భూపాల్ కుమార్, స్థానిక తాసిల్దార్ రవీందర్, ఎంపీడీవో సుమన వాణి, ప్రత్యేక అధికారి అప్పయ్య, స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి లు మాట్లాడుతూ విపత్తులను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ఆదర్శప్రాయమైన ధైర్య సాహసాలు, నిబద్ధతతో కూడిన వృత్తి నైపుణ్యాలతో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆపదలో ఉన్న వారిని రక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చింత సరోజిని, ఎంపీ ఓ  శ్రీధర్ రావు, ఆర్ ఐ రాజు, పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్, ఎన్ డి ఆర్ ఎఫ్ టీం సభ్యులు హెచ్ రవి కుమార్, గ్రామ పెద్దలు వాలంటీర్లు, విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.