
నిర్మల్ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో గురువారం నియోజకవర్గ కేంద్రమైన ముధోల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలికల)లో ‘బేటి బచావో బేటి పడావో ‘గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జ్యోతి, మౌనికలు, మాట్లాడారు. విద్యార్థినులు జాగ్రత్తతో ఉండాలి అని సూచించారు. సమాజములో జరుగుతున్న లింగ వివక్షతను, బాల్యవివాహాలు,సైబర్ క్రైమ్, చైల్డ్ లైన్ సర్వీసెస్, బాలికల విద్య, వాటి గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమములో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గీతా, ఉపాధ్యాయులు స్వర్ణలత, అంజూమ పర్వీన్, నీరజ, కవిత యాదవ్, కొక్కుల గంగాధర్, విద్యార్థినిలు తదితరులు, పాల్గొన్నారు.