
– కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి భారీగా కోత
– వివక్ష పార్టీలు పాలించే రాష్ర్టాలపై మోడీ ప్రభుత్వం వివక్ష
– అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టిన మోడీ
నవతెలంగాణ – పెద్దవూర
బడ్జెట్ కి కొనసాగింపుగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడ కేటాయించలేదని ఏకే ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టెబోయిన అనిల్ కుమార్ అన్నారు. హాలియా లోవిలేకరుల సమావేశం లో మాట్లాడారు. 248 పేజీల ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలసీతారామన్ ప్రసంగం లో తెలంగాణ రాష్ట్ర పేరును ఒక్కసారి కూడా ప్రస్థావించకపోవడం ఒక్క పైస కూడా కేటాయించకాపోవడం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు జీర్ణంచుకోలేకపోతున్నారు అని అన్నారు. అదేవిధంగా మోడీ ప్రభుత్వం గత కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి రూ.1.29 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి రూ.1.20 లక్షల కోట్లు కేటాయించి రూ.9 వేల కోట్ల మేర కోత విధించింది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి కేవలం జీస్టీ ద్వారా రూ.4,178 కోట్ల చెల్లింపులు చేస్తుంది అని అయిన తెలంగాణ రాష్ట్రనికి ఒక్క పైసాకూడ కేటాయించకుండా అన్యాయం చేసిందని అన్నారు. మోబైల్ ఫోన్ల పై 15 శాతం పన్ను తగ్గించి రీచ్చార్జ్ పై భారీగా పెంచి ప్రజలని కమ్యూనికేషన్ సర్వీస్ ఉపయెగాన్ని ప్రియం చేసిందని,దేశం లో సింహం భాగం పన్ను చెల్లింపుదారులు మధ్యతరగతి కుటుంబలే అని వారికి సంబంధంచి విద్య, ఇన్సూరెన్సు లపై టాక్స్ డిడక్షన్లు పెంచకపోవడం వారికి తీవ్ర అన్యాయం జరిగిందని, అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టిన విధంగా తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది MP లని తెలంగాణ ప్రజానీకం గెలిపిస్తే ఆ MP ల ద్వారా అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్టాన్ని బడ్జెట్ లో పక్కన పెట్టి తెలంగాణ ప్రజల మనోభావాలని దెబ్బతీయడం జరిగిందని అన్నారు.కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసన గాకేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి, మరియు బండి సంజయ్ చేసి మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి బడ్జెట్ సవరించేలా తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించేలా పోరాడాలని యావత్ తెలంగాణ ప్రజనీకం తరుపున కోరుతున్నాం అన్నారు.