నవతెలంగాణ బిజినెస్ బ్యూరో : అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ దినోత్సవం సందర్భంగా తమ ఖాతాదారులను సన్మానించినట్టు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, అమలాపురం, అనంతపురం తదితర ప్రాంతాల్లోని యాక్సిస్ బ్యాంకు శాఖల్లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయని ఆ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని 250పైగా ఎంఎస్‌ఎంఈ కస్టమర్లను వారి కృషికి గాను సత్కరించినట్టు పేర్కొంది. ఈ కార్యక్రమంల్లో యాక్సిస్ బ్యాంక్ సీనియర్ ప్రతినిధులైన నూతి చక్రవర్తి, విజరు శెట్టి, రాజేంద్ర జై కుమార్, జె రవీంద్రనాథ్ పాల్గొని ఎంఎస్‌ఎంఈ రంగాల్లో రాణించిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. 2024 మార్చి 31 నాటికి ఎంఎస్‌ఎంఈ రంగ రుణాల్లో యాక్సిస్ బ్యాంకుకు 8.4శాతం మార్కెట్ వాటా ఉంది.