నవతెలంగాణ- నాగార్జునసాగర్ అయోధ్య శ్రీరామ అక్షింతలను ఇంటింటికి పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ మాజీ, సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి నివాసానికి హాలియా శ్రీరామ భక్తులు సన్నాయి వాయిద్యాల నడుమ వెళ్లి అక్షింతలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరామ భక్తులు తదితరులున్నారు. ఎమ్మెల్యే జయవీర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసిన హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డిని బీఆర్ఎస్ నేత కే. కేశవరావు కూతురు హైదరాబాదు మేయర్ విజయ లక్ష్మి హిల్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందించి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితోపాటు నందికొండ కౌన్సిలర్ నిమ్మల ఇందిరాగౌడ్, బీఆర్ఎస్ నాయకులు కొండయ్య గౌడ్ ఉన్నారు.