నవతెలంగాణ – అశ్వారావుపేట
అయోధ్యలోని రామ జన్మభూమి లో బాలరాముని ప్రతిష్టామహోత్సవం సందర్భంగా కరినగర్ కు చెందిన సాహిత్య పరిషత్ జాతీయ స్థాయిలో ప్రచురించిన ‘‘అయోధ్య’’ సంకలనంలో అశ్వారావుపేట కు చెందిన కవి,సాహితీవేత్త డాక్టర్ సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు వ్రాసిన కవితకు స్థానం లభించింది. శ్రీరాముని మూర్తిమత్వాన్ని వర్ణిస్తూ వ్రాసిన శ్రీరామచంద్రుడు అనే వచన కవిత ఇందులో ప్రచురితమైనది. ప్రముఖ సాహితీవేత్త ,తెలుగు దళం ఛానల్ సి.ఇ.ఒ నంది శ్రీనివాస్, జాతీయ సాహిత్య పరిషత్ కార్యదర్శి గాజుల రవీందర్ సారధ్యంలో ప్రచురించిన ఈ పుస్తకంలో శ్రీరాముని జీవితాన్ని,రామాయణాన్ని,ఆలయ నిర్మాణం గురించిన వచన,పద్య కవితలు వ్యాసాలు ముద్రితమైనాయి.ఈ పుణ్య కార్యంలో తన కలానికి అవకాశం లభించడం పట్ల కవిగా తన జన్మసార్ధకమైందని ప్రభాకరాచార్యులు అభిప్రాయపడ్డారు. లబ్దప్రతిష్టులైన కవిపుంగవులు, వ్యాసకర్తలచేరూపొందించబడి దేశం యావత్తు గర్వించదగిన జాతీయ స్థాయి గ్రంధం లో ప్రభాకరాచార్యులు రచనకు స్థానం లభించడం పట్ల సాహితీవేత్తలు,ఉపాధ్యాయులు, సి.ఆర్.పిలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.