
మండలంలో అన్ని గ్రామాల్లో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా శనివారం తాడ్వాయి పోలీస్ స్టేషన్లో విజయదశమి వేడుకలను పోలీస్ సిబ్బందితో కలిసి జరుపుకున్నారు. ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో పోలీస్ స్టేషన్ కార్యాలయంలో పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పూజ అనంతరం ఆయుధాలపై పురోహితులు వేదమంత్రాలతో పూజించి ఇచ్చిన అక్షింతలను చల్లారు. ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దసరా వేడుకల సందర్భంగా ఆయుధ పూజ ఘనంగా నిర్వహించామని, దుర్గామాత ఆశీస్సులతో మండల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. పోలీస్ సిబ్బంది ఎలాంటి ఒత్తిళ్లకు లోని కాకుండా విధులను సక్రమంగా నిర్వహించాలని కోరుతూ, పోలీస్ సిబ్బందికి, మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.