మద్నూర్ మండలంలోని హెచ్ కేలూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నర్సింలు గౌడ్ తో పాటు ఆ గ్రామానికి చెందిన మరో ఇద్దరు భక్తులు 41 రోజులుగా పాదయాత్ర చేపట్టి శనివారం శబరిమలై కి చేరుకొని ఇరుముడి కట్టుకొని అయ్యప్ప దర్శనానికి సిద్ధమయ్యారు. ఈ భక్తుల పాదయాత్ర వేలాది కిలోమీటర్లు చేపట్టడం పట్ల ఆ గ్రామ ప్రజలు మండల ప్రజలు ఆ భక్తుల సహనానికి అభినందిస్తున్నారు. మరో రెండు రోజుల్లో అయ్యప్ప దర్శనం పూర్తవుతుందని శబరిమలై నుండి పాదయాత్ర భక్తులు మండల విలేకరులకు తెలియజేశారు మీ పాదయాత్ర మీ సహాయం ఎంతో గొప్పదిగా మండల ప్రజలు అభినందిస్తున్నారు.