నవతెలంగాణ – హలియా
నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి స్వామి ఆధ్వర్యంలో బుధవారం హాలియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాపడి పూజ శోభయానంగా కనివినిఎరుగని రీతిలో భారీ సినీ సెట్టింగ్ మండపాలతో నిర్వహించారు. తాత్రిక స్వామి సత్యనారాయణ గురుస్వామి పడిపూజను మంత్ర ఉచ్చరణతో ఘనంగా తంతు చేపట్టారు. కొనసీమకు చెందిన రాజేష్ కళాబృందం ఆలపించిన పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వాములు కూడా ఉత్సాహంగా కోరస్ పలికారు. ఒక శివభక్తుడు. శివుని అవతారంలో తాను నృత్యం చేస్తూ స్వాములను ఉత్సాహపరిచారు. మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సుమతి దంపత లు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే జైనీర్ కుమారుడు శివారెడ్డి కూడా మాలవేసుకొని తండ్రితో పాటు. ( పూజ నిర్వహించారు. స్వాములకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గురుస్వాములు మేడేపల్లి మోహన్రావు, గౌని రాజారవే మాయాదవ్, ఉపేందర్రెడ్డిలు ఏర్పాట్లు సమీక్షించారు. సుమారు 3వేల మంది స్వాములకు అల్పహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమం లో నాయకులు కర్నాటి లింగారెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, కాకునూరి నారాయణగౌడ్, తుమ్మలపల్లి చంద్రశేఖర్రెడ్డి, రాజాప్రసాద్, చిట్టి పోలు యాదగిరి, చింతల చంద్రారెడ్డి. అంకతి సత్యం, రామేశ్వరీ, ప్రవీణ్ రెడ్డి, సాగర్ రెడ్డి, చంద్రశేఖర్, వైబ్బు యాదగిరి, బాస్కర్నాయక్, కృష్ణనాయక్, పొదిల కృష్ణ వెంపటి శ్రీనివాస్, యేసు రాజు తదితరులు పాల్గొన్నారు.