మద్నూర్ మండలంలో అయ్యప్ప దీక్ష సాములు 41 రోజులపాటు దీక్షలో పాల్గొంటారు వీరందరికీ పాలధాతగా రౌతువార్ శంకర్ ముందుకు వచ్చి స్వాములందరికీ ఈ 41 రోజుల పాటు పాలు సరఫరా కావడానికి దాతగా నిలిచారు. 41 రోజులపాటు స్వాములందరికీ పాలధాతగా నిలిచిన వ్యక్తికి గురు స్వాములు స్వాములు ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో గురు స్వాములు సంతోష్ స్వామి , పండరి స్వామి , రఘు స్వామి , తుకారం స్వామి, సీనియర్ స్వాములు తదితరులు పాల్గొన్నారు.