అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టు, శబరిమల యాత్ర


నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట బుధవారం, అయ్యప్ప స్వాములు రాజు గురుస్వామి, నరేష్ స్వామి, యేమాల ఎలేందర్ రెడ్డి స్వాముల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇరుముడి కట్టు, శబరిమల యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు మహేందర్ స్వామి, శివ స్వామి, ప్రసాద్ ప్రసాద్ స్వామి, సంతోష్ స్వామి, శేఖర్ స్వామి, బాల రాజు స్వామి, సాయి స్వామి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.