హుస్నాబాద్ పట్టణంలోని అయ్యప్ప దేవస్థానంలో నూతన సంవత్సర సందర్భంగా బుధవారం మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న దంపతులు అయ్యప్పకు పాలాభిషేకం చేసి పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. పడిపూజ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవస్థానం చైర్మన్ ఆకుల వెంకన్న మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, భానుమూర్తి దేవస్థానం పూజారి సురేందర్ రెడ్డి, శివరాం, శ్రీకాంత్ బుచ్చిరెడ్డి, పాల్గొన్నారు.