అజాదికా అమృత్ మహోత్సవం

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలో జాతీయ రహదారి అథారిటీ ప్రాజెక్టు అద్వర్యం లో అజాధికా అమృత్ మహోత్సవం హైవే ప్రాజెక్టు మేనేజర్ ప్రభాకర్ రెడ్డి పోలీసు శాఖ తో కలసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలకేంద్రంలో వాహనదారులకు వెహికల్ చట్టంలో జాతీయ రహదారిపై వాహన దారులు ప్రయాణము చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అదే విదంగా వాహన దారులు నిబంధనలను సక్రమంగా పాటించలాని సూచించారు. ఒక వేల వాహన దారులు నిబంధనలు అక్రమిస్తే ఇభందులు పడే అవకాశం ఉంటాదాని తెలిపారు. వాహన దారులు జాతీయ రహదారిపై ప్రయాణం చేసే సమయంలో నియమ నిబంధనలను తప్పక పాటించి తమ తమ.ఇళ్లకు సుఖంగా చేరుకోవాలని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏస్ఐ కొనారెడ్డి, ఇన్సిడెంట్ మేనేజర్ ప్రతాప్ సింగ్, పోలీసు సిబ్బంది,జాతీయ రహదారి సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.