నిబంధనల ప్రకారం బీ కేటగిరీ సీట్లు భర్తీ చేయాలి

– ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యాలకు ఉన్నత విద్యామండలి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రయివేటు (మైనార్టీ, నాన్‌మైనార్టీ) ఇంజినీరింగ్‌ కాలేజీల్లో బీ కేటగిరీలో ఉన్న 30 శాతం సీట్లను నిబంధనల ప్రకారమే భర్తీ చేయా లని యాజమాన్యాలను ఉన్నత విద్యా మండలి ఆదేశించింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హు లైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌ లోనూ దరఖాస్తులను స్వీకరించాలని కోరారు. మూడు దినపత్రికల్లో (ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూ) ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యాలు బీ కేటగిరీ సీట్ల భర్తీకి సంబంధించి ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని సూచించారు. నిబంధనల ప్రకారం మెరిట్‌ ఆధారంగా చిత్తశుద్ధితో సీట్లు భర్తీ చేయాలని తెలిపారు.