– మారుమూల గ్రామాన్ని స్టేట్ లో పేరు నిలిపారు
– స్టేట్ టాపర్ గా ర్యాంక్ సాధించిన విద్యార్థికి వెల్లువెత్తుతున్న అభినందనలు
– దళిత పేద కుటుంబంలో జన్మించి స్టేట్ టాపర్ గా నిలవడంతో తల్లిదండ్రుల్లో సంతోషం
నవతెలంగాణ – మద్నూర్
2023, 24 సంవత్సరానికి గాను ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఒకేషనల్ కోర్సులో స్టేట్ టాపర్గా మద్నూర్ ఉమ్మడి మండలంలోని నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలంలోని లింబూర్ గ్రామానికి చెందిన బి సంతోష్ అనే విద్యార్థి 1000 మార్కులకు గాను 925 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచారు. రాష్ట్రానికి పూర్తిగా మారుమూల గ్రామమైన లింబూర్ గ్రామాన్ని స్టేట్ లో పేరు ప్రతిష్టలు తీసుకువెళ్లారు. స్టేట్ టాపర్గా నిలుస్తూ లింబూరు గ్రామ విద్యార్థి కి ఉమ్మడి మద్నూర్ మండలంలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. స్టేట్ టాపర్గా నిలిచిన బి సంతోష్ దళిత పేద కూలి నాలి జెసి జీవించే కుటుంబంలో జన్మిస్తూ ఒకేషనల్ కోర్సులు స్టేట్ టాపర్గా నిలిచినందుకు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం అవుతుంది. 2023 – 24 గాను ఒకేషనల్ కోర్సు ను లింబూర్ విద్యార్థి బాన్సువాడ లోని శ్రీ రేణుక ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సు చదివి స్టేట్ టాపర్గా నిలిచారు. చదువుకు పేద బీద తేడా లేదే అనటానికి స్టేట్ టాపర్గా నిలిచిన బి సంతోష్ నిదర్శనం లింబూరు గ్రామాన్ని స్టేట్ లో పేరు నిలబెట్టినందుకు ఆ విద్యార్థికి లింబూరు గ్రామ ప్రజలంతా అభినందించారు.