భువనగిరి మండల కేంద్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా బబ్బురి శంకర్ గౌడ్ జనరల్ సెక్రటరీ గా బైరగోని రమేష్ కోశాధికారి జెర్రి పోతుల ఉపేందర్ ఉపాధ్యక్షులు గా వెంకటేష్, నరేందర్,బిక్షనాయక్ నర్సింహులు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం తో జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్త చేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యలపై నిరంతరం పనిచేస్తానని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు చాలి చాలని వేతనాల తోటి జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం తమకున్న సమస్యలు పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి రాష్ట్ర నాయకులు కంకల సిద్దిరాజు, వివిధ మండలాల నుంచి వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపేందర్ మల్లేష్, ఆంజనేయులు, ఉస్మాన్, భిక్షనాయక్ , బాలకృష్ణ , నరేందర్, కృష్ణ, శ్రీను లు పాల్గొన్నారు.