వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్ రాం జయంతి

నవతెలంగాణ – అశ్వారావుపేట
మాజీ ఉప ప్రధాని,సంఘసంస్కర్త,మొదటి తరం దళిత ప్రజాప్రతినిధి డాక్టర్ బాబూ జగజ్జీవన్ రాం జయంతి ని శుక్రవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని వ్యవసాయ కళాశాల లో అసోసియేట్ డీన్ డాక్టర్ జె. హేమంత్ కుమార్ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు.మొదటగా బోధన,బోధనేతర సిబ్బంది, విద్యార్థులు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల  వేసి నివాళి అర్పించారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో బోధన సిబ్బంది విద్యార్థులు బాబు జగ్జీవన్ రామ్ స్వతంత్ర సమర యోధుడిగా, సామాజిక వేత్తగా, రాజకీయవేత్తగా ఇచ్చినటువంటి సేవలను కొనియాడారు.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా దేశంలో హరిత విప్లవం విజయవంతం కావడంలో ఆయన చేసినటువంటి కృషిని, అదేవిధంగా కేంద్ర రక్షణ మంత్రిగా పాకిస్తాన్ తో యుద్ధం సమయంలో ఆయన చూపినటువంటి తెగువ,కార్య దక్షత లను గుర్తు చేసుకున్నారు.స్వతంత్ర సమర సమయంలోను,క్విట్ ఇండియా,సత్యాగ్రహం వంటి కార్యక్రమాలలో నూ, పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన నడిచిన బాట, అనుసరించినటువంటి ఆదర్శాలు, చేపట్టిన సంస్కరణ మార్గాలు నేటి యువత ఆదర్శంగా తీసుకొని అనుసరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని బోధన సిబ్బంది విద్యార్థులకు సూచించారు.  ఈ కార్యక్రమానికి జాతీయ సేవా పథకం అధికారులు  డాక్టర్ ఎం.రాంప్రసాద్,డాక్టర్ ఆర్.రమేష్,డాక్టర్ పి.రెడ్డి ప్రియ, డాక్టర్ లక్ష్మణ్ బాధ్యులుగా వ్యవహరించారు. తహశీల్దార్ కార్యాలయంలో డీ టీ సుచిత్ర ఆద్వర్యంలో,సీ హెచ్ సీ లో డాక్టర్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో జయంతి నిర్వహించారు.