
భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతిని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మణికోళ్ల గంగాధర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప పరిపాలన దక్షకుడని పార్లమెంట్ లో అత్యున్నత పదవులు పొంది ఆ పదవులకే వన్నె తెచ్చిన గొప్ప నేత అని 50 సంవత్సరాలు రాజకీయ చరిత్రలో ఓటమి ఎరుగని నేతగా దళితుల అభ్యున్నతి కోసం పార్లమెంటులో రిజర్వేషన్ చట్టాన్ని అమలుపరిచిన మహనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సంతోష్, జ్యోతి, మహిపాల్, వినోద్, గంగాధర్, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.