– బాబు జగ్జీవన్ రాం విగ్రహ ఆవిష్కరణ
నవతెలంగాణ-నవాబుపేట్
దళితుల జాతికి సేవలందించిన గొప్పవ్యక్తి బా బు జగ్జీవన్ రాం అని ఎమ్మెల్యే కాలే యాదయ్య అ న్నారు. మండల పరిధిలోని లింగంపల్లిలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చేవెళ్ల ఎమ్మె ల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ దేశానికి బాబా సాహెబ్ అంబేద్కర్, జగజ్జీవన్ రావు అణగారిన జాతులకు దళితులకు సేవలు అందించడం వలనే మనమంతా ఇట్లా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షు లు ప్రొఫెసర్ ఖాసిం, మంద కష్ణ మాదిగ మాట్లా డుతూ భారత మాజీ ప్రధాని బాబు జగజీవన్ రామ్ భారత ప్రధానమంత్రి కావలసిన వారు అయినప్పటికీ మాదిగ కులానికి చెందిన వారు కాబట్టే ఆయన చరిత్రను నీకు తెలవకుండా చేస్తున్నారన్నారు దేశానికి దశాబ్దాలుగా సేవలందించిన నాయకుడని ఆయన చరిత్రను జాతికి తెలిసే విధంగా చేయాలన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన, రిజర్వే షన్ కల్పిం చడంలో దళిత జాతికి సేవలందిం చా రన్నారు. బాబు జగజీవన్ రామ్ స్వతంత్ర పోరాటం లోనూ రాజ్యాంగ రచనలోనూ పరిపాలనలోనూ రిజర్వేషన్ వ్యవస్థలోను ఎనలేని సేవలు అందించా రన్నారు. కార్యక్రమంలో మంద కష్ణ మాదిగ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, సి ఖాసిం, కడుమూరి ఆనందం, గుట్ట కింది రవికుమార్, మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు, సర్పంచులు సోలిపేట నర్సింలు, రత్నం, నాయకులు రంగారెడ్డి రామచంద్రయ్య, బద్రి,నర్సింలు,సుధాకర్ జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామస్తులు దళిత సంఘాల అభిమానులు తదితరులు పాల్గొన్నారు.