
దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం అని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.శుక్రవారం వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా పార్టీలకతీతంగా ఈ ప్రాంతంలో ఉన్న నాయకులందరూ కలిసి బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొనడం శుభ పరిణామం ఉన్నారు. వారు చేసిన సేవలు ఈ తరానికి ఒక స్ఫూర్తిగా నిలిచేందుకు ఈ జయంతి ఉత్సవాలు తోడ్పడుతాయని అన్నారు.ఏప్రిల్ మాసంలో మహానియుల జయంతులు జరుపుకోవడం గొప్ప విషయం అన్నారు..నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలన్నారు.జగ్జీవన్ రామ్ ఒక గొప్ప సంఘసంస్కర్త రాజకీయవేత్త సమాజంలో అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం కులరహిత సమాజం కోసం పోరాడిన ఒక గొప్ప పోరాట యోధుడు అని అన్నారు.. వారు ఎంపీగా కేంద్ర మంత్రిగా దేశ ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.జగ్జీవన్ రామ్ కూతురు మీరా కుమారి కూడా వారి అడుగు జాడల్లో నడుస్తూ దేశానికి సేవలు అందించారని,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో వారు స్పీకర్ గా ఉండి తెలంగాణ బిల్లు పాసయ్య సమయంలో వారు ఉన్నారని గుర్తు చేశారు.రానున్న రోజుల్లో వారి ఆలోచన పూర్తిగా తీసుకొని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడుతానని అన్నారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ బండ మల్లేష్ యాదవ్,ఎంపీటీసీలు వెల్మ నర్సవ్వ బాల్ రెడ్డి,రంగు వెంకటేశం,బొడ్డు రాములు,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉప అధ్యక్షుడు సాంగస్వామి యాదవ్,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు సాగరం వెంకటస్వామి,రూరల్ మండల అధ్యక్షుడు వకూలాభరణం శ్రీనివాస్,అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఎడపల్లి గంగరాజు,సంఘ సభ్యులు ఎడపల్లి అనిల్,తలారి రవి ఎడపల్లి మహేష్,తలారి సురేష్ ,ఎడపల్లి నాగరాజు,మాజీ సర్పంచ్ లు అడ్డిక జైపాల్ రెడ్డి,తిరుపతి రెడ్డి,సోయనేని కరుణాకర్,నాయకులు పుల్కం రాజు, కూరగాయల కొమురయ్య,వంగపల్లి మల్లేశం, దానే కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.