
ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం సాగించి రాజకీయ సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్ రామ్ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి పురస్కరించుకొని మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ..వివక్షను ఎదుర్కొంటూ ఉపప్రధాని స్థాయికి రావడం జగ్జీవన్‌రామ్ అకుంఠిత దీక్ష, పట్టుదల, క్రమశిక్షణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అన్నారు. ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన 1986 జూలై 6న పరమపదించారు అని వివరించారు. దళితుల హక్కులను రాజ్యాంగంలో అంబేడ్కర్ పొందుపరిస్తే వాటిని చట్ట రూపంలో అమలుచేయడానికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిది అన్నారు. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఆయన వారసురాలు మీరాకుమార్ పార్లమెంటులో నిర్వహించిన పాత్ర సైతం ఎంతో గొప్పది అని కొనియాడారు. అవమానాలు, ఆటంకాలను విజయాలుగా మలుచుకున్న నిజమైన దేశ నాయకుడిగా జగ్జీవన్ రామ్ ఎడిగిన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పిటిసి రంగు కుమార్ గౌడ్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు ఆకుల సురేందర్ రావు, ఎంపీటీసీ ఐత రాంచందర్, ఎండి ఉస్మాన్, మల్యాల నరసింహమూర్తి, గబ్బెట బాబు, మచ్చ సత్యం, గడ్డం కుమార్, గారె కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.