
నవతెలంగాణ – కంఠేశ్వర్
తప్పిపోయి మాటలురాని ఓ బాబు ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుగుతున్నట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ తిరుపతి, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ నుండి పోలీసులు తెలుపుతున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న 8-9 సంవత్సరాల వయసు గల ముస్లిం బాబు సోమవారం నిజామాబాదు 1 టౌన్ ఏరియా లో ఒంటరిగా తిరుగుతుండగా ..తన వివరాలు అడితే, తన వివరాలు చెప్పటం లేదు (మాటలు రావటం లేదు). ఇతని గురించి ఎవరికైనా తెలిస్తే 8712659714 నెంబర్ కు తెలియ చేయగలరు అనే పోలీసులు తెలుపుతున్నారు.