
మండలంలోని మునిగల వేడు గ్రామంలో బాబు జగ్జీవన్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించినట్లు సీపీఐ(ఎం) మండల నాయకుడు ఈ సంపల్లి సైదులు తెలిపాడు. స్వతంత్ర సమరయోధుడు భారత తొలి దళిత ప్రధాని గొప్ప సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రావు 116 వ జయంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల నాయకులు మాట్లాడుతూ సమరయోధుడు నేటి సమాజంలో నా కుల్లు కుట్ర చెత్త నీచ రాజకీయ నాయకుల కంటే ఒక కట్టుబాటు పట్టుదల నికర్షైన నాయకుడు న్యాయపోరాటం ప్రజల కోసం ప్రాణాలను సైతం వదిలేసి ప్రజలే నాకు ప్రాణం అని అణచివేత అవమానాన్ని అంటరానితనాన్ని సమూలంగా మార్పు తీసుకురావాలని అనేక పోరాట రూపాలను నెలకొల్పిన ఒక గొప్ప మహానుభావులలో బాబా జగ్జీవన్ రావు. తనదైన పాత్ర నిర్వహించడంలో తనను చరిత్రలు మరువలేని నాయకుడని గొప్ప సామాజిక ఉద్యమకారుడు అని ఆయనను కొనియాడారు. భవిష్యత్తు యువతీ యువకులు బాబు జగ్జీవన్ రావ్ బాటలో వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో మన వంతు పాత్రగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగరాజు ముత్తయ్య వెంకన్న పవన్ సంగీత అనసూర్య జ్యోతి బరిపాటి పల్లవి లక్ష్మీ ఎల్లమ్మ ఇద్దమ్మ పద్మ వెంకటమ్మ భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.