కంపచెట్లలో పసికందు లభ్యం సూర్యాపేట ఏరియాస్పత్రిలో చికిత్స

నవతెలంగాణ-మఠంపల్లి
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని సుల్తాన్‌పూర్‌తండాలో గుర్తు తెలియని వ్యక్తులు పసికందును కండ్లు తెరవకముందే కంపచెట్ల మధ్య వదిలేశారు. పసికందు ఏడుపు విని స్థానికులు గుర్తించి అంగన్వాడి టీచర్‌ ఉమా, ఆశావర్కర్‌ శాంతికి తెలియ జేశారు. వారు ఐసీడీఎస్‌ అధికారుల కు విషయం చెప్పగా.. జిల్లా వెల్ఫేర్‌ అధికారి సాయి, హెల్ప్‌లైన్‌ అధికారి వంశీ వచ్చి పసికందును సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి చికిత్స అందించారు. ఈ ఘటనపై సీడీపీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ.. కంప చెట్లలో వదిలేయడం వల్ల పసికందుకు ముండ్లు కుచ్చుకున్నా యని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారన్నారు.