అందర్నీ మెప్పించే ‘బచ్చలమల్లి’

'Bachchalamalli' that pleases everyoneహీరో అల్లరి నరేష్‌ నటించిన రస్టిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘బచ్చల మల్లి’. సుబ్బు మంగాదేవి దర్శకుడు. హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 20న క్రిస్మస్‌ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. హీరో కిరణ్‌ అబ్బవరం, హీరోయిన్‌ సంయుక్త ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. దర్శకులు మారుతి, త్రినాథ్‌ రావు నక్కిన, వశిష్ట, విజరు కనకమేడల, యదు వంశీ, కార్తిక్‌ వర్మ దండు, బలగం వేణు అతిధులు పాల్గొన్న ఈ ప్రీరిలీజ్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది.
హీరో అల్లరి నరేష్‌ మాట్లాడుతూ,’దర్శకుడు సుబ్బు కథ చెప్పగానే నాకు చాలా నచ్చింది. నా కోసం తను వెయిట్‌ చేశాడు. ఈ సంవత్సరం ‘బచ్చల మల్లి’ సక్సెస్‌తో ఎండ్‌ చేయాలని కోరుకుంటున్నాను. నిర్మాత రాజేష్‌తో జర్నీ కొనసాగాలని కోరుకుంటున్నాను. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ సినిమాని నిర్మించారు. సుబ్బు ఏదైతే చెప్పాడో అది తీశాడు. ఈనెల 20న మీ ముందుకు వస్తుంది. ఈ సినిమాని హిట్‌ చేస్తారా, బ్లాక్‌ బస్టర్‌ చేస్తారా, కల్ట్‌ చేస్తారా అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. ఒక్కటి మాత్రం చెబుతున్నాను. ఈ క్రిస్మస్‌ మనదే’ అని అన్నారు.
‘బచ్చలమల్లి క్యారెక్టర్‌ని కేవలం నరేష్‌ మాత్రమే చేయగలరు. అది ఈనెల 20న విట్నెస్‌ చేయబోతున్నాం. ఒక మంచి సక్సెస్‌ కోసమే మేం ఇద్దరం కలిసామని అనిపించింది. ఈనెల 20 తేదీన ఆ సక్సెస్‌ని మనం చూడబోతున్నాం’ అని డైరెక్టర్‌ సుబ్బు మంగాదేవి చెప్పారు. హీరోయిన్‌ అమత అయ్యర్‌ మాట్లాడుతూ,’మా టీమ్‌ అందరికీ ఈ సినిమా చాలా స్పెషల్‌. ఇందులో చేసిన కావేరి క్యారెక్టర్‌ని మీరందరూ చాలా ప్రేమిస్తారు’ అని అన్నారు. ‘బచ్చలమల్లి నేను చాలా ప్రేమించి చేసిన సినిమా. ఈ సినిమా రిలీజ్‌ కోసం నేను ఒక ప్రేక్షకుడిలా ఎదురు చూస్తున్నాను. సుబ్బు చెప్పిన కథకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాను. నరేష్‌కి కూడా సింగిల్‌ సిట్టింగ్‌లో ఈ కథ నచ్చింది’ అని నిర్మాత రాజేష్‌ దండా చెప్పారు.