హీరో నాగశౌర్య ప్రస్తుతం ఓ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఈ మూవీకి రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను బుధవారం మేకర్స్ లాంచ్ చేశారు. ఈ చిత్రానికి ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ని ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నాగశౌర్య యాంగ్రీ లుక్ అందరిలోనూ క్యూరియాసిటీని రైజ్ చేసేలా ఉంది. షూటింగ్ కంప్లీట్ కావస్తున్న ఈ చిత్రం ఆసక్తికర ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ప్రమోషన్స్‌ని ప్రారంభించింది. ఈ చిత్రంలో నాగశౌర్యకి జోడిగా విధి హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజరు కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్), నిర్మాత: శ్రీనివాసరావు చింతలపూడి, డీవోపీ: రసూల్ ఎల్లోర్, సంగీతం: హారిస్ జైరాజ్, ఆర్ట్: రామాంజనేయులు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్- సుప్రీమ్ సుందర్, పధ్వి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: శంకర్.
‘బ్యాడ్ బాయ్ కార్తీక్’..
10:13 pm